కలెక్టరేట్, జనవరి 11: స్వాతంత్య్ర ఉద్యమంలో వడ్డే ఓబన్న చేసిన పోరాటం భావితరాలకు ఆదర్శమని కలెక్టర్ పమేలా సత్పతి కొనియాడారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఓబన్న చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఓబన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం వడ్డెర జాతికి లభించిన అరుదైన గౌరవమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో పవన్‌కుమార్, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి అనిల్ ప్రకాశ్, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతుల సమ్మయ్య, ఉపాధ్యక్షుడు చల్ల రాజ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి కొమ్మరాజుల శ్రీనివాస్, నాయకులు ఒర్సు మురళి, భిక్షపతి, వెంకటేశ్, బొంత నగేశ్, తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్, జనవరి 11: మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పెంచాలని ఉపాధి హామీ అధికారులకు కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. రామకృష్ణకాలనీ, మహాత్మానగర్ గ్రామాల్లో నర్సరీలను గురువారం ఆమె పరిశీలించారు. మొక్కలకు జీవామృతం వాడాలని, సంప్రదాయ పద్ధతుల్లో పెంచాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీలత, తహసీల్దార్ కనకయ్య, అడిషనల్ డీఆర్డీవో సంధ్యారాణి, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, ఎంపీవో కిరణ్‌కుమార్, ఏపీవో లలిత, ఈసీ రాజు, టీఏలు హరీశ్, శేఖర్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.