తెలంగాణచౌక్, డిసెంబర్ 28: ఆర్టీసీ కోల్ టూరిజం సింగరేణి దర్శన్ బస్సు బుధవారం ఉదయం 9.30 గంటలకు కరీంనగర్‌కు చేరుకుంది. మొదటి సారి సింగరేణి దర్శన్ బస్సులో కోల్ టూరిజం వెళ్తుతున్న ప్రయాణికులకు డిప్యూటీ ఆర్ఎం చందర్రావు, డిపో-2 మేనేజర్ మల్లయ్య స్వాగతం పలికారు.
ఈసందర్భంగా డిప్యూటీ ఆర్ఎం చందర్రావు మాట్లాడుతూ, ఆర్టీసీ కోల్ టూరిజం ప్యాకేజీను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు, యువత, పర్యాటక ప్రేమికులు సింగరేణి ప్రాంతాలను, అండర్ గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్, జైపూర్ విద్యుత్ ప్లాంట్‌ను తక్కువ చార్జీలతో తిలకించే అవకాశం ఉందన్నారు. టూరిజంలో ప్రయాణికులకు టీ, మధ్నాహ్నం భోజన సౌకర్యం ఉంటుందన్నారు. కరీంనగర్ నుంచి బుకింగ్ చేసుకున్న ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ అధికారులు బస్సులో కోల్ టూరిజం వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.