కరీంనగర్ విద్యానగర్, ఆగస్టు 9 : ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, విరుపాక్ష హీరోయిన్ సంయుక్త మీనన్ శుక్రవారం కరీంనగర్లో మెరిశారు. గర్ల్స్ కాలేజీ రోడ్డులో ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చి సందడి చేశారు. ప్రముఖ వైద్యుడు సూర్యనారాయణరెడ్డి, కెయిమ్స్ చైర్మన్ చలిమెడ లక్ష్మీనరసింహారావు రిబ్బన్ కట్ చేసి, మాల్‌ను అట్టహాసంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాల్ నిర్వాహకులు, సీఎంఆర్ ఎండీ మావురి వెంకటరమణ మాట్లాడుతూ, కరీంనగర్లో ఏర్పాటు చేసిన మాల్ 32వదని, త్వరలోనే నిజామాబాద్, మేడ్చల్‌లో ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరికీ అందుబాటు ధరల్లో వస్త్రాలు ఉన్నాయన్నారు. 99 నుంచి 50 వేల వరకు విలువైన చీరెలు ఉన్నాయని చెప్పారు.
సినీతారలు పాయల్ రాజ్‌పుత్, సంయుక్త మీనన్ మాట్లాడుతూ, కరీంనగర్ బాగున్నదని, సీఎంఆర్ షాపింగ్ మాల్ చాలా బాగున్నదని హర్షం వ్యక్తం చేశారు. తమను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం సంతోషంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు.