జగిత్యాల విద్యానగర్, జనవరి 4:రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమా ర్ అన్నారు. పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా యువజన సర్వీసుల, క్రీడల శాఖ ఆధ్వర్యం లో జిల్లాస్థాయి యువజనోత్సవాలు 2023 కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్ బీఎస్ లత, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నరేశ్‌తో కలిసి బుధవారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ఏర్పా టు తర్వాత 6 జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీని ఏర్పా టు చేశారని తెలిపారు.
జిల్లాలో నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత లక్షా 50 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు జరిగాయని, 90 వేల ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలిపారు. ప్రైవేట్ రంగంలో 10 లక్షలకు పైగా యువత ఉద్యోగ అవకాశాలు పొందారని పేర్కొన్నారు. టీ హబ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం యువతకు నూతన ఆవిషరణలకు అవకాశం కల్పిస్తున్నదని చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి మాట్లాడుతూ, విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ బీఎస్ లత మాట్లాడుతూ, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్, పట్టణ కార్యదర్శి ప్రశాంత్ రావు, ప్రిన్సిపాల్ అశోక్, విష్ణు, రాజేశ్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
జగిత్యాల రూరల్, జనవరి 4: పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర హమాలీ సంఘం కార్యవర్గ సభ్యులు బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో తమ సంఘానికి ఐదు గుంటల స్థలం, సంఘ భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే ఇందుకు సానుకూలంగా స్పందించి సంఘానికి స్థలం, నిధుల మంజూరు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి ప్రశాంత్ రావు పాల్గొన్నారు.
పట్టణంలోని మారెట్లోని వేంకటేశ్వర ఆలయ చైర్మన్ మంచాల లవకుమార్ అన్న భాసర్ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బుధవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే బీఆర్ఎస్ పట్టణ కార్మిక విభాగం అధ్యక్షుడు తొలిప్రేమ శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతూ జగిత్యాలలోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతుండగా ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ బొడ్ల జగదీశ్, పట్టణ కార్యదర్శి బోయినపల్లి ప్రశాంత్ రావు తదితరులున్నారు.
జగిత్యాల పద్మనాయక వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యా లెండర్‌ను పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు వెంకటేశ్వర రావు, ప్రధా న కార్యదర్శి వేణు గోపాల్ రావు, కార్యవర్గ సభ్యులు, వెలమ కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.