CSII associations | కమాన్ చౌరస్తా, మే 8 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మే 9, 10, 11 తేదీలలో సీఎస్ఐఐ సంఘాల ఆధ్వర్యంలో సెయింట్ మార్కు చర్చి గ్రౌండ్లో క్రైస్తవ ఉజ్జీవ మాహాసభలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పొస్ట్రేట్ చైర్మన్ సీ రాములు ఇమ్మానుయేల్, అధ్యక్ష మండల కోశాధికారి డాక్టర్ ఎస్ జాన్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడి, కరపత్రం విడుదల చేశారు.
మానవత విలువలతో కూడిన ఫలభరితమైన జీవితం జీవించేందుకు, సమాజంలో మార్పు నిమిత్తం ఈ ఉజ్జీవ మాహాసభలు నిర్వహిస్తూన్నమని చెప్పారు. ఈ సభలలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ కలిగిన వైజాగ్‌కు చెందిన బ్రదర్ డాక్టర్ ఎం జేమ్స్ స్టీఫెన్ వాక్య పరిచర్య చేస్తారని చెప్పారు. జిల్లా వాసులు పెద్ద సఖ్యలో ఈ ఉజ్జీవ మాహాసభలలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్ కొమ్మాలు, డాక్టర్ ఎస్ జాన్, ఆర్ ప్రసాద్, బి ప్రసాద్, 4ఎ మధు మోహన్, పింటు, రోజి, యన్ సత్యానందం, రెనాల్డ్, నారాయణ, మాణిక్య రావు, రాధిక, ఇండిపెండెంట్ పాస్టర్స్, స్థానిక సంఘాల పెద్దలు పాల్గొన్నారు.