కరీంనగర్ కలెక్టర్‌గా చిత్రా మిశ్రా బాధ్యతలు
కరీంనగర్ నూతన కలెక్టర్‌గా నియామకమైన ఐఏఎస్ అధికారి చిత్రా మిశ్రా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయమే నగరానికి చేరుకున్న ఆమెకు అదనపు కలెక్టర్‌తోపాటు రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు.
- శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగ సంఘాల నాయకులు
కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 27 : కరీంనగర్ నూతన కలెక్టర్‌గా నియామకమైన ఐఏఎస్ అధికారి చిత్రా మిశ్రా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయమే నగరానికి చేరుకున్న ఆమెకు అదనపు కలెక్టర్‌తోపాటు రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ చాంబర్‌కు వెళ్లిన ఆమె, రిజిస్టర్లో సంతకం చేసి విధుల్లో చేరారు.
ప్రభుత్వ శాఖల అధికారులతో పరిచయ కార్యక్రమం అనంతరం ఆయా విభాగాల పనితీరుపై సమీక్షించారు. అంతకుముందు అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో కుందారపు మహేశ్వర్, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గడ్డం సుధాకర్ మొక్కలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా శాఖ ప్రతినిధులు కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీచరణ్, కార్యదర్శి డాక్టర్ అరవిందరెడ్డి, కోశాధికారి నాగరాజు, సహాయ కార్యదర్శి సుధాకర్, సాంస్కృతిక కార్యదర్శి రాజునాయక్, క్రీడాకార్యదర్శి కొండాల్రెడ్డితో పాటు రెవెన్యూ అధికారులు, కరీంనగర్ అర్బన్, రూరల్ తహసీల్దార్లు, ట్రెజరీ సిబ్బంది, ఇతర అధికారులు పూలమొక్కలు అందించి విషెస్ తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

