Peddapally | పెద్దపల్లి, ఫిబ్రవరి5: అంగన్వాడీల్లో పిల్లల ఎదుగుదలను నిరంతరం గమనించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో గురువారం సంక్షేమ శాఖ పని తీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలు నిబంధనల ప్రకారం పనిచేసేలా అంగన్ వాడీ సూపర్వైజర్లు పర్యవేక్షించాలని సూచించారు.
జిల్లాలోని 90 అంగన్వాడీ కేంద్రాల మరమ్మతుల కోసం రూ.2 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశామని, వాటిని సద్వినియోగం చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి ఒక పూట భోజనం తీసుకునేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు, సీడీపీవోలు అలేఖ్య, పుష్ప, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు చేయాలి : ఐ రాణి కుముదిని, రాష్ర్ట ఎన్నికల సంఘం కమిషనర్
పెద్దపల్లి జిల్లాలో పురపాలిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ర్ట ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని సూచించారు. మున్సిపల్ ఎన్నికలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, గోదావరిఖని ఏసీపీ రమేష్, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ విజయ్ పాల్గొన్నారు.