SSR School | తిమ్మాపూర్, నవంబర్14 : తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస రామానుజన్ పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలు గణంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణలో ఆకట్టుకున్నారు. లాయర్, డాక్టర్, పోలీస్, ఆర్మీ, అధికారుల వేషధారణలో అలరించారు.
ప్రతీ సంవత్సరం నవంబర్ 14న చిల్డ్రన్ డే వేడుకలు నిర్వహిస్తున్నట్టు పాఠశాల కరస్పాండెంట్లు బర్మయ్య, జితేందర్ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.