Check dam swimming | ఎల్లారెడ్డిపేట, జూలై 19: బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం చేసిన నీటి యజ్ఞంలో భాగంగా చేపట్టిన చెక్‌డ్యాం జలకల సంతరించుకుందనే విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ నాయకులకు మేలుకొలుపు కార్యక్రమంగా చెక్‌డ్యాంలో ఈతను తీసుకున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తెలిపారు. సింగారం-బండలింగంపల్లి చెక్‌డ్యాంలో బీఆర్ఎస్ నేతలు ఈత కొడుతూ చెరువును తలపిస్తున్న తీరుపై శనివారం కాంగ్రెస్ నేతలకు వివరించారు.
చెక్‌డ్యాం పక్కనున్న పొలాలు పచ్చదనంతో కలకలలాడుతున్న విశయాన్ని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడ క్రెడిట్ దక్కుతుందోనని మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కుంగితే రిపేర్ చేయకుండా తాత్సారం చేయడంపై ప్రజలు గమనిస్తున్నారని దుయ్యబట్టారు. మండుటెండల్లో కూడా ఎగువమానేరులో నీటిని నింపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేని అన్నారు. సిరిసిల్ల మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్, కేటీఆర్ చేసిన కృషి మామూలుది కాదని కొనియాడారు.
ఇప్పటికైనా రైతుల పక్షాన నిలబడి మేడిగడ్డ మరమ్మతులు పూర్తి చేసి బ్యారేజ్‌లు, చెరువులు నింపాలని డిమాండ్ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, నాయకులు అందె సుబాశ్, సింగారం దేవరాజు, మంగోలి నర్సాగౌడ్, తడుకల దేవరాజు, బంటి, నమిలికొండ శ్రీనివాస్, తడుకల స్వామి, మురళీమోహన్, నర్సింహారెడ్డి, దేవయ్య, క్రాంతి, తదితరులు ఉన్నారు.