MLA Satyanarayana | తిమ్మాపూర్ సర్వ సభ్య సమావేశం రసాభాస.. సమస్యలపై ఎమ్మెల్యే సత్యనారాయణను నిలదీసిన సర్పంచులు
తిమ్మాపూర్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు సమస్యలపై గళమెత్తారు.

MLA Satyanarayana | తిమ్మాపూర్, నవంబర్ 20 : తిమ్మాపూర్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు సమస్యలపై గళమెత్తారు. ఈ క్రమంలో మొగిలిపాలెం సర్పంచ్ దాట్ల తిరుపతి గ్రామంలో జరిగిన సమస్యలపై మాట్లాడుతుండగా ఆయన మైకును తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించడంతో సిబ్బంది తీసుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే మొగిలిపాలెం సర్పంచ్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచ్
వాగ్వాదం అనంతరం సర్పంచ్ తిరుపతి సమావేశం బహిష్కరించి బయటికి వెళ్లారు. ఆయనతోపాటు బీఆర్ఎస్ సర్పంచులు బయటికి వెళ్లేందుకు లేవగా వారిని ఎమ్మెల్యే వారించడంతో వారు అక్కడే ఉండిపోయారు. సమావేశంలో జరిగిన సంఘటనతో బీఆర్ఎస్ సర్పంచులు గుర్రుగా ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

