CPI | కరీంనగర్ తెలంగాణ చౌక్, ఎప్రిల్ 09 : సమ సమాజ స్థాపన కోసం జీవితాన్ని ధార బోసిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు అని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పేర్కొన్నారు. నగరంలోని ఆ పార్టీ కార్యాలయం బద్ధం ఎల్లారెడ్డి భవన్ లో చండ్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వెంకటస్వామి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటస్వామి మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో జన్మించిన రాజేశ్వరరావు ఉన్నత విద్యను అభ్యసించి కార్మిక, కర్షక, పేద,బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం భారత కమ్యూనిస్టు పార్టీలో చేరడన్నారు. దున్నే వాడికి భూమి కావాలని పేదలందరికీ భూమి చెందాలని భూసంస్కరణ చట్టం అమలు చేయడం కోసం ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూనే మరొకవైపు కోర్టులో ఆ చట్టం కోసం పోరాటం చేసి సాధించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి రాజేశ్వరరావు అన్నారు. ఆరు దశాబ్దాల పాటు భారత కమ్యూనిస్టు పార్టీ లో పనిచేసి ఉన్నతమైన పదవులు అనుభవించి, జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేశంలో అనేక ప్రజా ఉపయోగకర కార్యక్రమాలు నిర్వహించడంలో సఫలీకృతమై, నిరంతరం పేదల కోసం పరితపించిన గొప్ప మానవతావాది చంద్ర రాజేశ్వర్ రావున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు, పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కిన్నెర మల్లవ్వ, పిట్టల సమ్మయ్య, మచ్చ రమేష్, బోనగిరి మహేందర్, కంది రవీందర్ రెడ్డి,నాయకులు సత్యనారాయణ చారి,కొట్టే అంజలి,సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.