Chalo Goa | కమాన్ పూర్, ఆగస్టు 2: ఈ నెల 7న గోవా రాష్ట్రం లో అఖిల భారత జాతీయ ఓబీసీ 10వ మహాసభను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం, జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, మంథని నియోజకవర్గ అధ్యక్షుడు తోట రాజ్‌కుమార్ తెలిపారు. కావున ఈ సభన విజయవంతం చేయాలని కోరుతూ కమాన్ పూర్ మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట శనివారం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల ఆరాధ్యులు బీపీ మండల్ డే సందర్భంగా ఆగస్టు 7న గోవా రాష్ట్రంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో అఖిలభారత మేమెంతో.. మాకంతా.. హలో బీసీ.. ఛలో గోవా కు అధిక సంఖ్యలో తరలి వెళ్లి ఈ కార్యక్రమాన్ని విజవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తాటికొండ శంకర్, కొట్టె భూమయ్య, మచ్చగిరి రాము, గుర్రం లక్ష్మీమల్లు, బొమ్మగాని అనిల్, కమ్మగోని మల్లయ్య, పోల్దాసరి సాయికుమార్, మట్ట నర్సయ్య, కాస రవి, రాంచందర్, మానుక ఓదెలు, సుంచు శ్రీను, అనవేన అశోక్ పాల్గొన్నారు.