కాంగ్రెస్, బీజేపీలవి ఝూటా మాటలు
‘కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్టానికి పట్టిన శని. వాళ్లతో చాలా ప్రమాదం. నోరు తెరిస్తే చాలు అన్నీ ఝూటా మాటలే. నమ్మితే మోసపోతరు. మళ్లీ పాథ కథే అయితది’ అని వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రజలకు పిలుపునిచ్చారు.
- నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే
- నమ్మితే మోసపోతరు
- బీఆర్ఎస్తోనే సంక్షేమం
- ఆశీర్వదించండి..అభివృద్ధి చేస్తా
- వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు
- మేడిపల్లి, భీమారం మండలాల్లో ప్రచారం
మేడిపల్లి, నవంబర్ 11: ‘కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్టానికి పట్టిన శని. వాళ్లతో చాలా ప్రమాదం. నోరు తెరిస్తే చాలు అన్నీ ఝూటా మాటలే. నమ్మితే మోసపోతరు. మళ్లీ పాథ కథే అయితది’ అని వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం జగిత్యాల జడ్పీ ఉపాధ్యక్షుడు ఒద్దినేని హరి చరణ్ రావు, పార్టీ సీనియర్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు దరువు ఎల్లన్నతో కలిసి మేడిపల్లి, భీమారం మండలాల్లోని రంగాపూర్, కాచారం, విలయతాబాద్, వెంకట్రావుపేట్, రాగోజిపేట్, ఓడ్యాడ్, కమ్మరిపేట, భీమా రం మండల కేంద్రం, గోవిందారం, పసునూర్, మోతురావుపేట, రాజలింగంపేట గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు.
ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్తోనే సంక్షేమం, అభివృద్ధి అని చెప్పారు. ఈ ప్రాం తాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముం దుకు వస్తున్న తనను గెలిపిస్తే, వరద కాలువపై ఎత్తిపోతల పథకంతో మేడిపల్లి, భీమారం మండలాలను సస్యశ్యామలం చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఆరు నెలల్లోగా లింక్ రోడ్ల సమస్యలతో పాటు అన్ని రకాల సమస్యలను పరిషరిస్తానని హామీ ఇచ్చారు. కాగా, ఆయా గ్రామాల్లో చల్మెడకు మహిళలకు ఘన స్వాగతం పలికారు. వెంకట్రావుపేటలో మాజీ సర్పంచ్ అంగడి ఆనందం ఆధ్వర్యంలో చల్మెడకు నాగలిని బహూకరించారు.
కాంగ్రెస్, బీజేపీల నుంచి వలసల వెల్లువ
మేడిపల్లి మండలం పోరుమల్లకు చెందిన శివ సేన, యువసేన యూత్ సభ్యులు సుమారు 40మంది కాంగ్రెస్, బీజేపీలను వీడి బీఆర్ఎస్లో చేరారు. మేడిపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీపీ ఉమాదేవి, రత్నాకర్ రావు, యువ నాయకుడు వంశీ రావుల ఆధ్వర్యంలో చేరగా, వారికి చల్మెడ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే రంగపూర్ గ్రామానికి చెందిన యువకులు, కాచారం గ్రామానికి చెందిన 30 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. వెంకట్రావుపేట గ్రామానికి చెందిన రజక సంఘం సభ్యులు చల్మెడకు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ ఉమా, రాజా రత్నాకర్‌రావు, వైస్ ఎంపీపీ దొంతి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు క్యాతం సత్తిరెడ్డి, ప్యాక్స్ చైర్మన్లు రవీందర్ రావు, పానుగంటి శ్రీనివాస్, మారెట్ కమిటీ చైర్మన్ రమ్య, ఆదిరెడ్డి, వైస్ చైర్మన్ కొప్పెర లింగారెడ్డి, నాయకులు అం కం సాగర్, రావు శ్రీనివాస రావు, అంగడి ఆనంద్‌కుమార్, ఎండీ రాజబోస్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

