కథలాపూర్, ఏప్రిల్ 20 : రజతోత్సవ సభతో బీఆర్ఎస్ సత్తా చాటుదామని, వేడుకల్లో గులాబీ దళం బలం చూపిద్దామని పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పిలుపునిచ్చారు. ఆదివారం కథలాపూర్ మండలకేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని, రజతోత్సవ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి కావడం సంతోషకరంగా ఉందన్నారు. సభకు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు సభ కోసం సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు కోరుట్లలో సిరికొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడి ప్రైవేట్ దవాఖానను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మామిడిపెల్లి రవి, గండ్ర కిరణ్‌రావు, గడ్డం భూమారెడ్డి, కేసరి సాయన్న, దొప్పల జలేందర్, వంగ రవీందర్, శీలం మోహన్‌రెడ్డి, సోమ దేవేందర్ రెడ్డి, ఏజీబీ మహేందర్, తిరుజానీ, రవీందర్ నాయక్, సీతరాంనాయక్, శేఖర్, చీటి విద్యాసాగర్‌రావు, మేడిపెల్లి సాయిరెడ్డి, గంగారెడ్డి, జిల్లా రాజు, గంగారెడ్డి, పాలెపు నర్సయ్య, జెల్ల వేణుగోపాల్ యాదవ్, కోలి నరేందర్ పాల్గొన్నారు.