వీణవంక, అక్టోబర్ 05 మండలంలోని చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 2002-03 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులంతా ఒకచోట చేరి అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సభాముఖంగా తమ కష్ట సుఖాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యులను పరిచయం చేస్తూ, వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం అందరూ ఆడిపాడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మొగిలి, ఆవునూరి సాగర్, చుక్క సాగర్, సురేందర్, అంజాద్, ఫసి, హరికృష్ణ, గంజి తిరుపతి, మహేశ్, శ్రావణ్, రవీందర్, సంపత్, వి. సాగర్, కొండాల్, సతీష్, లావణ్య, సుమలత, స్వర్ణ, పద్మ, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు