జగిత్యాల టౌన్/రూరల్/కలెక్టరేట్/సారంగాపూర్/ఇబ్రహీంపట్నం/మల్లాపూర్/కథలాపూర్/మల్యాల/మారుతీనగర్/కోరుట్ల రూరల్/ మేడిపల్లి/రాయికల్/ధర్మపురి/పెగడపల్లి/గొల్లపల్లి, సెప్టెంబర్ 26: జిల్లా వ్యాప్తంగా గురువారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ విగ్రహాలతో పాటు చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, రజక సంఘాల సభ్యులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
కాగా, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి అదనపు కలెక్టర్ రాంబాబు పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతమ్‌రెడ్డి, ఆర్డీవో మధుసూదన్, కలెక్టరేట్ ఏవో హన్మంతరావు, బీసీ, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్లు సాయిబాబా, రాజ్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, వివిధ శాఖల జిల్లాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఎస్పీ అశోక్‌కుమార్ పూల మాల వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీంరావు, ఏవో శశికళ, డీఎస్పీ రవీంద్రకుమార్, డీసీఆర్బీ, ఎస్బీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరీఫ్ అలీఖాన్, ఆర్ఐ రామకృష్ణ, వేణు, ఆర్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ పత్తిరెడ్డి మైపాల్ రెడ్డి, ప్రత్యేకాధికారి డాక్టర్ నరేశ్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ భూమారెడ్డి, రజక సంఘం నాయకులు కొత్తకొండ లింగయ్య, గంగన్న, సురేశ్, భూమరాజు, లింగం, తదితరులు పాల్గొన్నారు.
చల్గల్లో ఐలమ్మ విగ్రహానికి రజక యువత ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ సర్పంచ్ ఎల్ల గంగనర్సు, మాజీ ఉప సర్పంచ్ నలువాల తిరుపతి, రజక యూత్ అధ్యక్షుడు బొల్లారపు భూమేశ్, ఉపాధ్యక్షుడు గంగన్న, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో రజక సంఘాల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమాల్లో మాజీ వైస్‌ఎంపీపీ కొండ్ర రాంచందర్ రెడ్డి, మాజీ సర్పంచులు గుర్రాల రాజేందర్ రెడ్డి, ఎడమల జయ-లక్ష్మారెడ్డి, బొడ్డుపెల్లి రాజన్న, మోత్కురి ప్రసాద్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ ఎండీ ఇబ్రహీం, మాజీ ఉపసర్పంచ్ రాచకొండ రాజేశం, మాజీ వార్డు సభ్యులు మల్లేశం, బేర మహేశ్, రజక సంఘం మండలాధ్యక్షుడు మర్రిపెల్లి రమేశ్, సంఘ నాయకులు కందుకూరి తిరుపతి, ప్రవీణ్, రాజు, తిరుపతి, వెంకటాద్రి, తదితరులు పాల్గొన్నారు. కథలాపూర్తో పాటు సిరికొండ, బొమ్మెన, చింతకుంట గ్రామాల్లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి రజక సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బొమ్మెన గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రజక సంఘం మండలాధ్యక్షుడు చిలుముల మహేశ్, రాజేందర్, ప్రసాద్, గంగాధర్, రాజం, రవి తదితరులు పాల్గొన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంతో పాటు రేగుంట, మొగిలిపేట గ్రామాల్లో చాకలి ఐలమ్మ విగ్రహాలకు రజక సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో రజక సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మండలం బర్తిపూర్లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి మాజీ సర్పంచ్ సంగం సాగర్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు నర్సయ్య, దేవన్న, రాందాస్, గణేశ్, చిన్నయ్య, రావులు, పెద్ద గంగారాం, ఓరుగంటి సాగర్, దిలీప్, శేఖర్, అజయ్, అశోక్, జగదీశ్, శ్రీనాథ్, మధు తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల మండలం మాదాపూర్, ఐలాపూర్, తదితర గ్రామాల్లో చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, సహకార సంఘం అధ్యక్షుడు గడ్డం ఆదిరెడ్డి, నాయకులు లింబాద్రి, గణేశ్, మల్లారెడ్డి, కాశీరెడ్డి, రజక సంఘాల సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మెట్పల్లి పట్టణంలో ఐదు రజక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. పాతబస్టాండ్‌లోని ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అలాగే, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో పట్టణ రజక సంఘాల అధ్యక్షులు వన్నెల శశి, కలికోట వేణు, పిప్పెర రాజ్‌కుమార్, వన్నెల సాయిలు, దొడ్డిపట్ల శ్రీనివాస్, పట్టణ రజక సంఘం సభ్యులు, ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వెంకటేశ్, అధ్యాపకులు శ్రీనివాస్, జగపతి, మహేశ్వరీ, నర్సయ్య, ప్రతిభ, మంజుల, స్వర్ణలత, జమున, జాకీర్, ఫాతిమా, విద్యార్థులు పాల్గొన్నారు. మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తాతో పాటు రామన్నపేటలో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ ఈవో శ్రీకాంత్, రజక సంఘం నాయకులు రాజమల్లయ్య, లక్ష్మణ్, శైలేశ్, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రత్నాకర్‌రావు, బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు స్పందన, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు చాంద్ పాషా, మాజీ సర్పంచ్ గంగారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సాగర్‌రావు, రజక సంఘం అధ్యక్షుడు శ్రీను, గంగాధర్, రాజలింగం, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్, తిరుపతి, సత్యం, సాయిరెడ్డి, గంగారాం, నాగరాజు, రాజం, ప్రశాంత్, జగదీశ్ పాల్గొన్నారు. రాయికల్ పట్టణంతో పాటు ఇటిక్యాలలో చాకలి ఐలమ్మ విగ్రహాలకు రజక సంఘాల నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ తురగ శ్రీధర్‌రెడ్డి, రజక సంఘం నాయకులు రాజు, భూమయ్య, గంగాధర్, శ్రీను, రమేశ్, రాజం, మహేశ్, వెంకటేశ్, శ్రీనివాస్, సామల్ల వేణు, గంగారెడ్డి, ఆదిరెడ్డి, వేణు, లింబాద్రిగౌడ్, స్వామిరెడ్డి, లక్ష్మణ్, ముత్తన్న, శేఖర్, శ్రీనివాస్, రజక సంఘం అధ్యక్షుడు గంగరాజు, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. మేడిపల్లి, భీమారం మండలాల్లో నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకల్లో మాజీ సర్పంచులు అంగడి ఆనంద్‌కుమార్, సుధవేని భూమేశ్‌గౌడ్, కాటిపెల్లి జగన్‌రెడ్డి, నాయకులు చెక్కపెల్లి రఘు, చేపూరి నాగరాజు, నర్సారెడ్డి, రాజు, శంకర్, రాకేశ్, వెంకటేశ్, మహేశ్, నర్సయ్య, గంగాధర్, సంజీవ్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. ధర్మపురి పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, కౌన్సిలర్లు వేముల నాగలక్ష్మి, జక్కు పద్మ, అనంతుల విజయలక్ష్మి, అరుణ, నాయకులు దినేశ్, జక్కు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
పెగడపల్లిలోని నందీ చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ చిత్రపటానికి రజక సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం నాయకులు కొత్తకొండ శ్రీనివాస్, మంద సత్తయ్య, ఒడ్నాల జితేందర్, రాజు, సంతోష్, శ్రీనివాస్, అంజయ్య, మల్లేశం, మల్లయ్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గొల్లపల్లి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, రజక సంఘం అధ్యక్షుడు సత్యం, మాజీ ప్రజాప్రతినిధులు సత్యం, లింగారెడ్డి, రాజశేఖర్, తిరుపతి రెడ్డి, నాయకులు మహేశ్, రవీందర్, సత్యం, రామన్న, జలందర్, సతీశ్ రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.
ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం
జగిత్యాల టౌన్, సెప్టెంబర్ 26: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. జగిత్యాలలోని చింతకుంట చెరువు వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి-లక్ష్మణ్, కమిషనర్ సమ్మయ్య, ఆర్డీవో మధుసూదన్, కౌన్సిలర్లు బాలె లత-శంకర్, పద్మ-పవన్, పంబాల రామ్‌కుమార్, నక్క జీవన్, రజక సంఘం సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక ఐలమ్మ
కోరుట్ల, సెప్టెంబర్ 26: సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకమని కొనియాడారు. అలాగే, చాకలి ఐలమ్మ విగ్రహానికి మున్సిపల్ అధ్యక్షురాలు అన్నం లావణ్య, కమిషనర్ తిరుపతి, కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఫహీం, అనిల్, సత్యం, శ్రీనివాస్, మధు, రాజం, నాగభూషణం, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.