Kishore Makwana | గోదావరిఖని : సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-1 పరిధిలోని జీడీకే 11 గనిని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్ పర్సన్ కిషోర్ మాక్వనా, సభ్యులు వడ్డేపల్లి రాంచందర్, లవకుష్ కుమార్, సెక్రెటరీ ఐఏఎస్ అధికారి గూడె శ్రీనివాస్ సందర్శించారు.
గోదావరిఖని పట్టణంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ సోదరుడి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా వారు సింగరేణి గనిని సందర్శించడానికి వచ్చారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్పర్సన్, ఇతర సభ్యులు అధికారులకు సింగరేణి యాజమాన్యం రామగుండం డివిజన్ వన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ వారికి ఘన స్వాగతం పలికారు. గని లోపల యాంత్రికరణ పద్ధతులు, ఇతర సాంకేతికతను వారికి అధికారులు వివరించారు.