చందుర్తి, డిసెంబర్ 17: సెస్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పిలుపునిచ్చారు. మండలంలోని లింగంపేట గ్రామంలో శనివారం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. రైతులకు నిరంతర నాణ్యమైనా విద్యుత్ అందిస్తున్నదన్నారు.
సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న పొన్నాల శ్రీనివాస్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం బీజేపీ దళిత మోర్చా మండలాధ్యక్షుడు లింగంపల్లి బాబు బీఆర్ఎస్లో చేరగా, గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య, ఏఎంసీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, కేడీసీసీబీ డైరెక్టర్ జలగం కిషన్‌రావు, వైస్ ఎంపీపీ మందాల అబ్రహం, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కమలాకర్‌రావు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఎల్లయ్య, నాయకులు మరాఠి మల్లిక్, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.