Avvagarintiki Nenelli Potha | కోల్ సిటీ, జూలై 26: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబ్ నటుడు, సినీ మాటల రచయిత, సింగరేణి కార్మికుడు దుబాసి రాకేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘అవ్వగారింటికి నేనెళ్లి పోతా… జానపద పాటల సీడీని గోదావరిఖని ఏఆర్ ఏసీపీ ప్రతాప్ చేతుల మీదుగా అవిష్కరించారు. ఈమేరకు గోదావరిఖనిలో జరిగిన కార్యక్రమంలో ఏసీపీ ప్రతాప్ ముఖ్యతిథిగా హాజరై రాకేష్ ను ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణలో పుట్టిన జానపద పాటలకు ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపు ఉందనీ, ఈ పాటల సీడీకి మంచి ఆదరణ లభించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, నాగెపల్లి గ్రామంకు చెందిన నరేశ్ నిర్మాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో సినీ అభిమాన సంఘాల జిల్లా చైర్మన్ గుండేటి రాజేష్, యూట్యూబ్ స్టార్ వేముల అశోక్, దయానంద్ గాంధీతోపాటు పలువురు కళాకారులు పాల్గొన్నారు.