Alcohol in public places | ఓదెల, ఆగస్ట్ 21 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధించినట్లు ఎస్సై దీకొండ రమేష్ పేర్కొన్నారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఓదెల మండల గ్రామాలలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధమని తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాల్లోని పాఠశాలలు, దేవాలయాల ప్రదేశాలలో మద్యం సేవిస్తే చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామాలలో గల వివిధ బహిరంగ ప్రదేశాల పరిసర ప్రాంతాలలో మద్యం సేవించరాదని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలన్నారు.