సుల్తానాబాద్ రూరల్ : మేత కోసం వెళ్తున్న గొర్రెల పైకి కారు ( Car ) దూసుకు వెళ్లడంతో పది గొర్రెలు ( Sheeps ) మృత్యువాత పడ్డాయి. ఒకరికి స్వలగాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులో శనివారం కాట్నపల్లి వైపు వెళుతున్న గొర్రెల మందపైకి పెద్దపల్లి నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు దూసుకెళ్లి పంట పొలాల్లో నిలిచిపోయింది.
ఈ ప్రమాదంలో పది గొర్రెలు మృతిచెందగా , గొర్రెల మేత కోసం తీసుకు వెళ్తున్న శాస్త్రి నగర్‌కు చెందిన రాజుకు గాయాలయ్యాయి. అతడిని వెంటనే కరీంనగర్ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. మరో ఆరు గొర్రెల పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు వివరించారు.