ఓదెల, మార్చి 8: రోడ్డుపై కార్లు వెళ్లడం ఇప్పటివరకు మనం చూసినం. కానీ అదే కారు రైలు పట్టాల పై పరుగెడుతుంటే ఆసక్తి కనబరుస్తుంది. ఇలా శనివారం కొలనూర్ రైల్వే స్టేషన్లో చూపరులను ఆకట్టుకుంది. రైల్వే పట్టాల పని తీరును కారులో ప్రయాణిస్తూ పరీక్షించే కొత్త టెక్నాలాజీ అందుబాటులోకి వచ్చింది. తక్కు వ సమయంలో ఎక్కువ కిలో మీటర్లు ప్రయాణిస్తూ రైలు పట్టాలు ఏలా ఉన్నాయో పరీక్షిస్తున్నారు రైల్వే అధికారులు.
ఈ వాహనాన్ని రోడ్డు కమ్ రైల్ వే(ఆర్ఆర్వీ) వ్యాన్ అంటారు. ఈ వాహనం రోడ్డు పై టైర్లతో, రైలు పట్టాల పై ఇనుప చక్రాలతో నడిచే విధంగా తయారు చేశారు. ఈ వాహనం ద్వారా రైల్వే సిబ్బంది ట్రాక్‌ను సూపర్వైజర్ చేస్తుంటారు. ఈ కారు మాదిరి వాహనం శనివారం కొలనూర్ స్టేషన్ నుంచి పట్టాలపై పరుగెడుతుంటే ప్రజలు ఆసక్తిగా తిలకించారు. భలేగా ఉందే అంటూ చెప్పుకొన్నారు.