తిమ్మాపూర్, ఏప్రిల్ 29 : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో బీ.ఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతున్న 80 మంది విద్యార్థులు పలు ప్రముఖ కంపెనీలకు ఎంపికయ్యారని కళాశాల చైర్మన్ రమేష్ రెడ్డి తెలిపారు. ఎంపికైన విద్యార్థులందరు హైదరాబాద్కు చెందిన అంతర్జాతీయ ఫార్మా కంపెనీలైన భారత్ యోటెక్, హెటిరో ఫార్మా, ఎం.ఎస్.ఎన్ ల్యాబొరేటరీస్, సాయి లైఫ్ సైన్సెస్, అపోలో ఫార్మసీలలో ఉద్యోగాలు సాధించారు.
ఈ క్యాంపస్ నియామకాలను మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారి సహకారంతో నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రామనర్సింహా రెడ్డి వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులందరికీ ఆయా కంపెనీ ప్రతినిధులు, కళాశాల చైర్మన్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఓ డీలు డా. రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్, ధనుంజయ్, ఈశ్వరప్ప, ఇతర అధ్యాపకులు.. విద్యార్థులను అభినందించారు.