CA course | చిగురుమామిడి, జూలై 19: మండలంలోని చిన్న ముల్కనూరు మోడల్ స్కూల్ లో ఐసీఏఐ కరీంనగర్ చాప్టర్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సీఏ కోర్సు పై శనివారం అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సికాస చైర్మన్ చార్టెడ్ అకౌంటెంట్ గందెశ్రీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని చేపట్టగా చార్టెడ్ అకౌంటెంట్ మహేష్ రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించారు.
చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ ప్రాముఖ్యతను తెలుపుతూ కోర్సు యొక్క పరీక్ష విధానము కాలవ్యవధి లభించే ఉపాధి అవకాశాలను వివరించారు. అనంతరం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి హర్జిత్ కౌర్ మాట్లాడుతూ సీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సును తమ విద్యార్థులకు అవగాహన కల్పించినందుకు ఐసీఏఐ కరీంనగర్ వారికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీజీటీ కామర్స్ ఎస్కే ఆసిఫ్ అలీ, పీజీటీ ఎకనామిక్స్ అందె సురేందర్, పీజిటీ సివిక్స్ పి. రాములు, పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు పాల్గొన్నారు.