..ఈ చిత్రంలో కుప్పలుగా కనిపిస్తున్న సంచులు చూసి ఇదేదో పెద్ద గోదాం అనుకుంటే పొరపాటు పడ్డట్టే! కరీంనగర్ మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన కర్రె గంగారాం తాను ఊరూరా కొనుగోలు చేసి, పోగు చేసే రేషన్ బియ్యం కోసం తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న గోదాం! అయితే పీడీసీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ చేశారన్న సమాచారంతో కరీంనగర్ రూరల్ పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా, అక్కడ నిల్వ ఉన్న 629 బ్యాగులను చూసి అవాక్కయ్యారు. వెంటనే గంగారాంను అదుపులోకి తీసుకొని విచారించగా.. కొన్ని నెలలుగా కరీంనగర్ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ.. ప్రజల దగ్గర తక్కువ ధరకు కొని, వాటిని తీసుకొచ్చి బ్యాగులలో నింపి ఇలా పోగు చేస్తున్నట్లు తెలిపాడు.
ఇలా పోగు చేసిన సంచులను ఒకేసారి లారీల్లో లోడు చేసి మహారాష్ట్ర, పౌల్ట్రీ ఫాంలలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు చెప్పాడు. ఈ సందర్భంగా పోలీసులు 300 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకొని, నిందితుడిని అరెస్ట్ చేసి, కోర్టుకు పంపించారు. బియ్యాన్ని సివిల్‌సైప్లె వారికి అప్పగించారు. పెద్ద మొత్తంలో బియ్యం పట్టుకొన్న సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్ఐ నరేశ్, సిబ్బందిని కరీంనగర్ సీపీ గౌస్అలం, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ అభినందించారు. – కరీంనగర్‌రూరల్, అక్టోబర్ 14