వేములవాడ, డిసెంబర్ 1: తన గెలుపు కోసం కష్టపడ్డ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ విజయం కోసం రెండునెలలుగా ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా వారియర్స్, నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు రాత్రింబవళ్లు పనిచేశారని కొనియాడారు.
వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. మీ అందరూ చూపిన ప్రేమానురాగాలు, వేములవాడ ప్రజల, రాజన్న ఆశీస్సులతో తప్పనిసరిగా మంచి మెజార్టీతో గెలుస్తామని నమ్మకం ఉన్నదన్నారు. ఆదివారం ఓట్ల లెకింపు తర్వాత మళ్లీ కలుస్తానని పేర్కొన్నారు. మీతో అనుబంధాన్ని ఇలాగే కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.