రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో సోషల్ మీడియా కార్యకర్త సాయిగౌడ్ వివాహ వేడుకకు హాజరవుతారు. 11.30 గంటలకు రెడ్డి సంఘం మండలాధ్యక్షుడు గుండాడి వెంకట్రెడ్డి నివాసంలో శుభకార్యానికి, మధ్యాహ్నం 12గంటలకు ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటిలక్ష్మణ్రావు (హరిదాస్నగర్) గృహప్రవేశానికి హాజరుకానున్నారు. అదే గ్రామంలో దళితబంధు పథకం కింద హరిదాస్నగర్ దళితులు ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును 12.30 గంటలకు ప్రారంభించనున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రానికి చేరుకుంటారు. ఒంటి గంటకు అయ్యప్ప ఆలయంలో జరిగే పడిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు మండల కేంద్రంలో బీఆర్ఎస్ యూత్ నాయకుడు గుణశేఖర్ సోదరి వివాహానికి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గంభీరావుపేట మండల కేంద్రానికి చేరుకుంటారు. శ్రీగాధలో పార్టీ సీనియర్ నాయకుడు మాణిక్రావు, చొక్కారావు కుటుంబ సభ్యులు, 3.30కు మండల కేంద్రంలోని ఎంపీటీసీ దేవేందర్, పార్టీ పట్టణాధ్యక్షుడు వెంకట్యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సాయంత్రం 5గంటలకు హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు.