గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట/ముస్తాబా ద్, మే 14: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల నియోజవకర్గంలో పర్యటించారు. తెలంగా ణ భవన్లో పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్‌పై సరళిపై కార్యకర్తలతో చర్చించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం సింగారంలోని సయ్యద్హజ్రత్ ఇమామ్ఆలీ దుర్వేషావలీ దర్గాను సందర్శించారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్‌లో చౌడాలమ్మను దర్శించుకున్నారు. తర్వాత గంభీరావుపేట మండలం గోరంటాలలో ఎల్లమ్మ సిద్ధోగం వేడుకలకు హాజరయ్యారు. అమ్మవార్ల ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి.. పాడి పంటలు సమృద్ధిగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆకాంక్షించారు. గంభీరావుపేట మండలం గోరంటాల ఎల్లమ్మ సిద్ధో గం వేడుకలకు కేటీఆర్ హాజరై, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కట్నకానుకలు సమర్పించి మాట్లాడారు. గౌడ సభ్యుల కులదైవం ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం, సిద్ధోగం వేడుకలను వైభవంగా నిర్వహించుకోవడం అభినందనీయమని కొనియాడారు. ఇక్కడ నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, ఎంపీటీసీ ఎర్రం అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ కొలుముల అంజ మ్మ, నాయకులు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్‌రెడ్డి, కొలుముల బాల్‌రెడ్డి, భాషణవేని సురేందర్, జంగంపల్లి శేఖర్‌గౌడ్, గౌడ సంఘం సభ్యులు కోటగిరి బాబు, యాదగిరిగౌడ్, తదితరులు ఉన్నారు.
గంభీరావుపేటలో ఈ నెల 26న నిర్వహించనున్న ఎల్లమ్మ కల్యాణోత్సం, సిద్ధోగం వేడుకలకు రావాలని కోరుతూ గౌడ సం ఘం సభ్యులు మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వాన పత్రిక అం దించారు. ఇక్కడ గౌడ సంఘం సభ్యులు వెంకటస్వామిగౌడ్, రాజాగౌడ్, వెంకటస్వామిగౌడ్, యాదగిరిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, నాగరాజుగౌడ్, అక్షయ్గౌడ్ ఉన్నారు.
ఎల్లారెడ్డిపేట మండలం సింగారంలోని సయ్యద్ హజ్రత్ ఇమాంఅలీ దుర్వేషావలీ దర్గాలో జరుగుతున్న ఉత్సవాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ హాజరయ్యారు. దర్గాను సందర్శించి ఉర్సు ఉత్సవ నిర్వాహకుడు అజీజ్‌తో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గాపై చాదర్ కప్పి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆయా కార్యక్రమాల్లో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ పట్టణా ధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనా రాయణ, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, బీఆర్ ఎస్ మండలాధ్య క్షులు బొంపెల్లి సురేంద ర్రావు, గజభీంకార్ రాజన్న, నాయకులు చీటి నర్సింగరావు, బొల్లి రామ్మోహన్, ఎండీ సత్తార్, కోడి అం తయ్య, అగ్గి రాములు, వాసరవేని దేవరాజు, నర్సాగౌడ్, నాగరాజు ఉన్నారు.