గంభీరావుపేట, డిసెంబర్ 6: అధైర్యపడొద్దు.. అన్నివిధాలా అండగా ఉంటామని బాధిత కుటుం బ సభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసానిచ్చారు. సముద్రలింగాపూర్ సర్పంచ్ మోతె రాజిరెడ్డి తండ్రి వెంకటరాములు మృతి చెందగా, బాధిత కుటుంబా న్ని, దమ్మన్నపేటలో అరుట్ల పోచిరెడ్డి, ఆవునూరి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బీఆర్ఎస్ సర్కారు మరోసారి అధికారంలోకి రాకపోవడాన్ని తట్టుకోలేక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామాని కి చెందిన ఆవునూరి దేవయ్య గుండెపోటుతో మంగళవారం మృతి చెందాడు. ఈ క్రమంలో బు ధవారం బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు. పార్టీ కోసం చురుకుగా పని చేసిన దేవయ్య అకాల మరణం దురదృష్టకరమని కేటీఆర్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉం టుందని బాధిత కుటుంబ సభ్యులకు భరోసా నిచ్చారు. అధైర్యపడొద్దు.. అన్నివిధాలా అండగా ఉంటామని హామీఇచ్చారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగ య్య, మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, ఏఎంసీ చైర్మన్ కొత్తింటి హన్మంతరెడ్డి, వైస్ చైర్మన్ గోగు లింగంయాదవ్, సర్పంచులు సిరిగిరి లక్ష్మి, బాల్యానాయక్, ఉప సర్పంచులు అరుట్ల అంజిరెడ్డి, దేవేం ద్రం, నాయకులు వంగ సురేందర్‌రెడ్డి, లింగన్నగారి దయాకర్‌రావు, కమ్మరి రాజారాం, కామిడి సదాశివరెడ్డి, అంబర్‌సింగ్, వేణు, మహేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.