వేములవాడ రూరల్, అక్టోబర్ 29: ఎములా డ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేద్దాం.. ముచ్చటగా ముడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసుకుందాం. తాను డబ్బులు సంపాదించుకోవ డానికి రాజకీయాల్లో రాలేదని.. ప్రజా సేవ చేయ డానికి వచ్చానని.. ఒకసారి తనకు అవకావం ఇవ్వండి.. అని వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఓట్లు అభ్యర్థించారు. ఆదివారం ఆయన వేములవాడ మున్సిపల్ పరిధి అనుబంధ గ్రామాలైన శాత్రాజుపల్లి, నాంపెల్లిలో ఇంటింటా ప్రచారం నిర్వహించగా, మహిళలు పెద్దఎత్తున స్వాగతంపలికారు.
అనంతరం చల్మెడ మాట్లాడుతూ, తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. మీ మధ్యే ఉం టూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసానిచ్చారు. నమక్మంతో ఓటేయండి, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తాన న్నారు.
తనకు సేవ చేయడమే తప్పా.. మోసం చేయడం రాదన్నారు. వేములవాడ ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాన ని, మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభి వృద్ధి, సంక్షేమ పథకాల గురించి గడపగడపకూ వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నా రు. ఆయన వెంట జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, రేగులపాటి కృష్ణదేవరావు, కౌన్సిలర్లు రెండుమి ద్దెల విజయ, నిమ్మశెట్టి విజయ, జడల లక్ష్మి, నీలం కళ్యాణి, కుమార్, పట్టణాధ్యక్షుడు పుల్కం రాజు, నాయకులు సలీం, జడల శ్రీనివాస్, నీలం శేఖర్, మ్యాకల శ్రీనివాస్, క్రాంతి, రఘు, శ్రీని వాస్, తదితరులు పాల్గొన్నారు.