GP Worker | ధర్మారం : గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పట్ల, గ్రామ పంచాయతీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరు శ్రీధర్ ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో సార్వత్రిక సమ్మె సందర్భంగా ర్యాలీ నిర్వహించిన అనంతరం గుండెపోటు రావడంతో మండల పారిశుధ్య కార్మికుల సంఘం అధ్యక్షుడు ఆకుల రాజయ్య మృతి చెందడం బాధాకరమన్నారు.
ఆకుల రాజయ్య కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి వారికుటుంబలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికులకు సరిగా జీతాలు చెల్లించకపోవడంతో పాటు గ్రామపంచాయతీలకు నిధులు రాకపోవడంతో గత కొన్ని మాసాలుగా గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా మారిందని వాపోయారు. పెండింగ్ లో ఉన్న పారిశుద్ధ కార్మికుల జీతాలను వెంటనే విడుదల చేయాలని, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి చెల్లించాలని డిమాండ్ చేశారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి మాజీ జిల్లా సభ్యులు పూసుకురి రామారావు, ఏగ్గల స్వామి, కోమటిరెడ్డి మల్లారెడ్డి, దాడి సదయ్య, పాక వెంకటేశం, కాంపెల్లి చంద్రశేఖర్, తుమ్మల రాంబాబు, ఆవుల శ్రీనివాస్ మాజీ ఉప సర్పంచ్ లు ఆవుల లత, సంకసాని సతీష్ రెడ్డి, నాడం శ్రీనివాస్, గాజుల రాజు, దేవి వంశీ, దేవి నలిని కాంత్, సల్వాజి మాధవరావు, బొలిశెట్టి సుధాకర్, దేవి రాజారాం, నేరెళ్ళ చిన్న లచ్చన్న, దేవి రాజేందర్, ఆవుల వేణు, నారా ప్రేమ సాగర్, అజ్మీర శ్రీనివాస్ నాయక్, అమరపెల్లి నారాయణ, అజాం బాబ, గుమ్ముల నర్సయ్య, చందు తదితరులు పాల్గొన్నారు.