వేములవాడ, జూన్ 23: పట్టణంలోని ప్రైవేట్ విద్యాసంస్థలపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని బీఆర్ఎస్ విద్యార్థి విభా గం నాయకుడు పోతు అనిల్‌కుమార్ ఆరోపించారు. ఆదివారం ఆయన పట్టణంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు.
ప్రైవేట్ విద్యాసంస్థల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 20వేల నుంచి లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దుస్తు లు, పుస్తకాల పేరిట అందినకాడికి దండుకుంటున్నారని ఆరోపించారు. నిబంధనల కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ తుమ్మల దిలీప్, రాకేశ్, సందీప్, మహేందర్ ఉన్నారు.