కేశోరాంలో బీఆర్ఎస్ జయకేతనం
హోరాహోరిగా సాగిన బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారం గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన ప్యానల్ జయకేతనం ఎగురవేసింది. అధ్యక్షుడిగా బయ్యపు మనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దాడి మహేశ్ గెలుపొందారు. బీఆర్ఎస్ విజయంతో కార్మికులు సంబురాల్లో మునిగిపోయారు.
- గుర్తింపు సంఘం అధ్యక్షుడిగా మనోహర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శిగా మహేశ్ విజయం
- సంబురాల్లో కార్మికలోకం
- విజయోత్సవ ర్యాలీలు
పాలకుర్తి, మార్చి 20: హోరాహోరిగా సాగిన బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారం గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన ప్యానల్ జయకేతనం ఎగురవేసింది. అధ్యక్షుడిగా బయ్యపు మనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దాడి మహేశ్ గెలుపొందారు. బీఆర్ఎస్ విజయంతో కార్మికులు సంబురాల్లో మునిగిపోయారు.
సోమవారం కర్మాగారంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 263 మంది కార్మికులకుగా ను 100 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. 3 ఓట్లు చెల్లలేదు, 260 ఓట్లలో అధ్యక్షులుగా పోటీచేసిన బయ్యపు మనోహార్‌రెడ్డి (బీఆర్ఎస్) 97 ఓట్లు, సూరసమ్మయ్య (కాంగ్రెస్) 85ఓట్లు, ఇంజపూరి నవీన్‌కుమార్(బీఆర్ఎస్)78 ఓట్లు సాధించారు. మనోహర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి సమ్మయ్యపై 12 ఓట్ల తే డాతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా దా డి మహేశ్ (బీఆర్ఎస్) 117 ఓట్లు, రమేశ్మౌ ర్య (బీఆర్ఎస్)77 ఓట్లు, రాజశ్రీసత్యనారాయణ (కాంగ్రెస్)64 ఓట్లు, చెల్లనిఓట్లు 5 పడ్డా యి. బీఆర్ఎస్ అభ్యర్థి రమేశ్మౌర్యపై, అదే పా ర్టీకి చెందిన అభ్యర్థి దాడి మహేశ్ 40 ఓట్ల స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించారు.
ఈ మే రకు ఎన్నికల అధికారి డానియల్ విజేతలను ప్రకటించారు. బీఆర్ఎస్ విజయంతో కార్మికులు సంబురాల్లో మునిగిపోయారు. విజయోత్సవ ర్యాలీలు తీశారు. అభినందలతో ముంచెత్తారు. ర్యాలీలో కమాన్‌పూర్ సింగిల్‌విండో చైర్మన్ ఇనుగంటి భాస్కర్‌రావు, మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్, ఫ్యాక్స్ వైస్‌చైర్మన్ కురిక్యాల సురేశ్, ఉ ప సర్పంచ్ పుట్ట రంజిత్, మాజీ సర్పంచ్ పర్శవేని శ్రీనివాస్ యాదవ్, నాయకులు జగన్‌రెడ్డి, కోండ్రశంకర్, చిప్పరవి, పుప్పాల దయానంద్, నగునూరి రమేశ్, ఇటిక్యాల శ్రీకాంత్, కుమా ర్, బయ్యపు భాస్కర్‌రెడ్డి, మధునయ్యగౌడ్, కంకటిరవిగౌడ్, డిష్ఖదీర్, తెల్లకనుకయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల హక్కుల సాధనకు కృషి
– బయ్యపుమనోహర్రెడ్డి
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేశోరాం కర్మాగారం కార్మికుల హక్కు ల సాధనకు కృషి చేస్తా. వారి సమస్యలపై పో రాటం చేస్తా. సర్కారు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా. తన విజయానికి సహకరించిన కార్మిక లోకానికి కృతజ్ఞతలు. జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్టమ ధు, జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కోరుకంటిచందర్, ప్రభుత్వ విప్ భానుప్రసాద్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహార్రెడ్డికి ధన్యవాదాలు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

