సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 20: వంద రోజుల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ విమర్శించారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఏనాడూ నేతన్నలు ధర్నాలు, ఆందోళనకు దిగిన పరిస్థితులు లేవన్నారు. బతుకమ్మ చీరలకు సం బంధించిన కేవలం 50 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేసి తమ గొప్పగా కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 3,312 కోట్ల ప్రభుత్వ ఆర్డర్లు సిరిసిల్లకు అందించామన్నారు.
నేత కార్మికుల మెరుగైన జీవన విధానం కల్పించడంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం బతకుమ్మ చీరల తయారీ ఆర్డర్లను ఇచ్చిందని గుర్తు చేశారు. తద్వారా నేతన్న నెలకు 15 వేల కనీస వేతనం పొంది సంతోషకరమైన జీవనం సాగించారన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచి ప్రభు త్వం చెల్లించాల్సిన బకాయిల కోసం జేఏసీ ఏర్పాటు చేసుకుని పోరాడాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. నేతన్నల బిల్లు ల కోసం గత నెల 15న మహాధర్నా చేపడుతామని కేటీఆర్ చెప్పారని, అదేవిధంగా సిరిసిల్లకు వచ్చిన సందర్భంలో కేసీఆర్ నేతన్నల బిల్లుల కోసం పోరాటానికి సిద్ధమని ప్రకటించారని, తద్వారానే ప్రభుత్వం దిగివచ్చి 50 కోట్ల బిల్లులు విడుదల చేసిందన్నారు.
కార్మికులకు చెల్లించాల్సిన యారన్ సబ్సిడీ 18 కోట్లు పెండింగ్లో ఉందన్నారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ ఏడాది పాటు పని కల్పిస్తామని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి ఉపాధి కల్పించకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే 200 కోట్లు బతుకమ్మ చీరల బిల్లులు మంజూరు చేసిందన్నారు. పెండింగ్లో ఉన్న 150కోట్లు విడుదల చేయాల్సి ఉండగా కాంగ్రెస్ సర్కారు కేవ లం 50 కోట్లు విడుదల చేసిందని, వెంట నే మొత్తం బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు దార్ల సందీప్, వెంగళ శ్రీనివా స్, బొల్లి రామ్మోహన్, గెంట్యాల శ్రీనివాస్, సత్తార్, లింగంపల్లి సత్యనారాయణ, వీరబత్తిని కమలాకర్, అడ్డగట్ల మురళి, సామల శ్రీనివాస్, పోరండ్ల రమేశ్ పాల్గొన్నారు.