siricilla | సిరిసిల్ల రూరల్, జూలై 18: బీఆర్ఎస్ పడిగెల అనిల్ కుమార్ కుటుంబాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సిం గ రావు శుక్రవారం పరామర్శించారు. తంగళ్ళపల్లి మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పడిగల రాజు సోదరుడు పడిగల అనిల్ కుమార్ దవాఖాన లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం అనిల్ నివాసానికి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తో కలిసి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా అనిల్ చిత్ర పటానికి పూల మాల వేసి, నివాళులర్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్ట్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండోచైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, ప్యాక్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి, మాజీ సర్పంచ్ అంకారపు అనిత, మాజీ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్, పార్టీ నాయకులు రాఘవరెడ్డి, ఎలగందుల నరసింహులు, బండి జగన్, కందుకూరు రామ గౌడ్, అబూబాఖర్ తదితరులు ఉన్నారు.