కోరుట్ల : మున్సిపల్ ఎన్నికల్లో ( Muncipal Elections ) పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ( MLA Sanjay ) పిలుపునిచ్చారు.
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ తరుపున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే నాయకుల నుంచి గురువారం దరఖాస్తులను ( Application ) స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమమే పార్టీని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు తెలియజేయలన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.
టికెట్లు ఎవరికి వచ్చినా ఐక్యమత్యంతో పనిచేసి పార్టీ అభ్యర్థి గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకంతో పార్టీ నుంచి పోటీ చేసేందుకు నాయకులు ముందుకు రావడం సంతోషం కలిగిస్తుందని వివరించారు.
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నాయకుల నుంచి దరఖాస్తులు వెలువెత్తుతున్నాయి. గురువారం ఒకేరోజు 122 మంది ఆశావాహులు దరఖాస్తులు అందజేశారు. ఒక్కోవార్డు నుంచి నలుగురైదుగురు ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సింగిరెడ్డి నారాయణరెడ్డి, గుడ్ల మనోహర్, పహీం, గడ్డం మధు రహీం పాషా, క్యాతం సృజన్, గేల్లి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.