Siricilla | సిరిసిల్ల రూరల్, ఆగష్టు 2: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ సింగిల్ విండో చైర్మన్ పబ్బతి విజయేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను తెలంగాణ భవన్ లో శనివారం నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సింగరావు, జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, పలువురు పార్టీ నేతలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు.
నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించారు. పలువురు నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి విజయేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు రాజన్న, రాఘవరెడ్డి, వొజ్జల అగ్గి రాములు, కుంబాల మల్లారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ లు కృష్ణారెడ్డి, బండ సత్తయ్య, రామ్మోహన్ రావు, వాలకొండ వేణుగోపాలరావు, సురభి నవీన్ రావ్, మాజీ సర్పంచ్ అడ్డ గట్ల భాస్కర్, ఏసీ రెడ్డి రాంరెడ్డి, గుగ్గిల్ల అంజయ్య గౌడ్, అమర్ రావు, జక్కుల రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.