చిగురుమామిడి, డిసెంబర్ 26: బీఆర్ఎస్ శ్రేణులు అధైర్య పడద్దని, రాబోయే భవిష్యత్తు మనదేనని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్‌లో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గ్రామాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, నాయకులు పెనుకుల తిరుపతి, బెజ్జంకి రాంబాబు, ఎసే షిరాజ్, అందె పోచయ్య, కంది రాజశేఖర్‌రెడ్డి, అనుమాండ్ల సత్యనారాయణ, నాగెల్లి రాజిరెడ్డి, దుడ్డెల లక్ష్మీనారాయణ, సదానందం, కిష్టయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు.