BRS NRI leader | పాలకుర్తి : రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మాజీ ఎంపీపీ కుమారుడు బీఆర్ఎస్ ఎన్నారై విభాగం నాయకుడు వ్యాళ్ళ హరీష్ రెడ్డి స్వదేశాగమానం సందర్భంగా రామగుండం బీఆర్ఎస్ శ్రేణులు ఎయిర్ పోర్ట్ వద్ద సోమవారం ఘన స్వాగతం పలికారు. రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేందుకు మాతృదేశం వస్తున్నట్టు వాళ్ల హరీష్ రెడ్డి తెలిపారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిత్యం సోషల్ మీడియా వేదికగా హరీష్ రెడ్డి ఎండగడుతూ వచ్చారు.
రాష్ట్రంలో రైతుబంధు రైతు బీమా పలు సమస్యలపై నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలుమార్లు విమర్శించారు. రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం చేసేందుకు తాను రామగుండం నియోజకవర్గంలో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటానని బీఆర్ఎస్ కార్యకర్తలకు అండదండగా ఉండి నియోజకవర్గంలో బీఆర్ఎస్ని మరింత పటిష్టం చేస్తానన్నారు. ఆయన 10 సంవత్సరాలుగా వీహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు విద్యా వైద్యం, ఎండపల్లి మండలంలోని మారేడుపల్లి, గ్రామంలో ఉచితంగా పాఠశాల భవనం నిర్మించారు. అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకి ఉచితంగా దుస్తులు, ఇతర సౌకర్యాలు అందజేశారు.