వేములవాడ రూరల్, నవంబర్ 17: మిడ్‌మానేరు జలాశయంలో సర్వంకోల్పోయిన నిర్వాసితులను నిండాముంచి.. మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని.. ముమ్మాటికీ వారందరినీ ఆదుకున్నది బీఆర్ఎస్ మాత్రమేనని వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు స్పష్టం చేశారు. గురువారం ఆయన వేములవాడ మం డలం అనుపురం, గుర్రవానిపల్లిలో ఇంటింటా ప్రచారం నిర్వహించి, మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన మిడ్‌మానేరు జలాశయాన్ని పెండింగ్‌లో పెట్టి, నిర్వాసితులకు సరైన ప్యాకేజీ ఇవ్వకుండా నిండాముంచిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రాజెక్టును పూర్తిచేసి, నిండామునిగిపోయి అష్టకష్టాల్లో ఉన్న నిర్వాసితులందరినీ ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు.
ఇంకో రూ.28కోట్లు కేటాయిస్తే ముంపు గ్రామాల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నా రు. అనుపురంలో బుడగజంగాల వాసులకు దళితబంధు, నాన్‌నోటిఫైడ్ ఇండ్ల పట్టాలు ఇప్పించడంతోపాటు ముంపు గ్రామాలు, గుర్రంవానిపల్లిలోని సమస్యలను గెలిచిన ఆరు నెలల్లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఎన్నికల ప్రచారానికి వచ్చిన చల్మెడకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏను గు మనోహర్‌రెడ్డి, జడ్పీటీసీ మ్యాకల రవి, ఎంపీపీ బూర వజ్రమ్మ, వైస్ ఎంపీపీ ఆర్సీ రావు, సర్పంచుల ఫోరం మం డలాధ్యక్షుడు ఊరడి రాంరెడ్డి, సెస్ డైరెక్టర్ హరిచరణ్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణదేవరావు, సర్పంచులు వెంకటరమణరావు, గుర్రం లక్ష్మారెడ్డి, స్వయంప్రభ, రేగులపాటి రాణి, గ్రామశాఖ అధ్యక్షులు మెర్గు శ్రీనివాస్‌గౌడ్, లచ్చిరెడ్డి, కొమురవ్వ, రంగు రాములు, నరసింహారెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.