కోనరావుపేట, నవంబర్ 25: ‘మీ సేవకుడిగా వస్తున్నా.. ఒక్కసారి ఆశీ ర్వదించండి’.. అని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావు కోరారు. ఆయా గ్రామాల గౌడ సంఘం సభ్యులతో శనివా రం మల్కపేటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి చల్మెడ హాజరై, మాట్లాడారు. స్వరాష్ట్రంలో గౌడ కులస్తుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు. ఈత, తాటి చెట్ల పెంపకంతోపాటు పింఛన్, బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.
రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి చేసేం దుకు కృషి చేస్తానని వెల్లడించారు. భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చల్మెడకు గౌడ కులస్తులు భరోసానిచ్చారు. ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ న్యాల కొండ అరుణ, ఎంపీపీ చంద్రయ్యగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, యువజన విభాగం మండలాధ్యక్షుడు ముష్నం జీవన్ గౌడ్, రైతు బంధు సమితి జిల్లా కమిటీ సభ్యుడు అబ్బసాని శంకర్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.