BRS meeting | పెగడపల్లి: పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో ఎల్లాపూర్‌లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, మల్లేశం, గంగాధర్ గౌడ్, రాజు, వినోద్, తిరుపతి, భాస్కర్ రెడ్డి రాజేశ్వరరావు, నరెందర్‌రెడ్డి, నర్సింహరెడ్డి, లక్ష్మణ్, సత్యనారాయణరెడ్డి, రాజశేఖర్ గౌడ్, తిరుపతి, వీరేశం, ఆనందం, సంజీవరెడ్డి, జానీపాషా, రవి, కనకయ్య, స్వామి, ఆంజనేయులు, రాజేందర్, ఉదయ్, అంజి, వెంకటేశం తదితరులున్నారు.