local body elections | చిగురుమామిడి, జూలై 11: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యకర్తలు సమిష్టితో పనిచేసి మండలంలో పార్టీ సత్తా చాటాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. మండలంలోని బొమ్మనపల్లి లో మండలంలోని అన్ని గ్రామశాఖ అధ్యక్షులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. వారికి పార్టీ చేపట్టాల్సిన ప్రణాళికలు, వ్యూహాలను దిశా నిర్దేశం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటినుండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల్లో బిఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలనీ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక, రాజీవ్ యువ శక్తి పథకంలో అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదని, వాటిని ప్రజలకు ఇంటింటా వివరించాలన్నారు.
ఈ సమావేశంలో గ్రామశాఖ అధ్యక్షులు ఆకవరం మఠం శివప్రసాద్,యాల్ల జనార్దన్ రెడ్డి, బుర్ర తిరుపతి గౌడ్, గీట్ల తిరుపతి రెడ్డి, బోయిని రమేష్, ఎస్ కే సిరాజ్ పాషా, సన్నీళ్ల మల్లేశం, కలువల సంపత్ రెడ్డి, ఏండ్ర నారాయణ,కొమ్ము కొమురయ్య, రావుల వెంకన్న, పిల్లి వేణు, కత్తుల రమేష్, బిల్లా వెంకట్ రెడ్డి, తోడేటి శ్రీనివాస్, శ్యామకూర సంపత్ రెడ్డి, నాగేల్లి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.