BRS leadersBRS leaders | వీణవంక, జూలై 26: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నిరాధారమైన అరోపణలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ మండల నాయకులు ఎస్ఐ ఆవుల తిరుపతికి ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తిరుపతికి శనివారం బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశాలు, పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్ కేటీఆర్‌పై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, ప్రత్యేకంగా హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేశారనే అసత్య వ్యాఖ్యలు పరువునష్టం కలిగించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు.
రాజకీయపరమైన విమర్శలకన్నా వ్యక్తిగత జీవితంపై దాడి చేయడమేనని తెలిపారు. నిరాధారమైన ఆరోపణల వల్ల కేటీఆర్ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంటుందని, మహిళల ఆత్మాభిమానాన్ని కూడా దెబ్బతీసేవిధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిఉండి ఇలా బాధ్యతారహితంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేఖంగా ఉందని, ఈ విషయంపై విచారణ జరిపి సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మావురపు విజయభాస్కర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, వీణవంక గ్రామశాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి మహేశ్, నాయకులు కనకం అనిల్, దాసారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.