Rajayogam | మీ భార్యతో మీకు రాజయోగం వస్తుందా? న్యూమరాలజీ ఏం చెబుతున్నదంటే..!
Rajayogam | మగాడి జీవితంలో విజయం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సుఖసంతోషాలు వంటి అంశాలు అన్నింటిపై జీవిత భాగస్వామి ప్రభావం ఎంతో ఉంటుందని చాలామంది నమ్ముతుంటారు. న్యూమరాలజీ ప్రకారం కూడా వ్యక్తి జీవితంలో భార్య పాత్ర అత్యంత కీలకమని చెబుతుంటారు.
Rajayogam | మగాడి జీవితంలో విజయం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సుఖసంతోషాలు వంటి అంశాలు అన్నింటిపై జీవిత భాగస్వామి ప్రభావం ఎంతో ఉంటుందని చాలామంది నమ్ముతుంటారు. న్యూమరాలజీ ప్రకారం కూడా వ్యక్తి జీవితంలో భార్య పాత్ర అత్యంత కీలకమని చెబుతుంటారు. భార్య పుట్టిన తేదీ ఆధారంగా లెక్కించే మూలాంకం ద్వారా ఆమె వ్యక్తిత్వంతో పాటు భర్త జీవితంపై చూపే ప్రభావాన్ని కూడా అంచనా వేయొచ్చని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన మహిళలు భర్తకు రాజయోగం తీసుకొస్తారని అంటుంటారు. మరి ఆ తేదీలు, మూలాంకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మూలాంకం 1
ఏ నెలలోనైనా 1, 10, 19, 28వ తేదీల్లో పుట్టిన వారి మూలాంకాన్ని 1గా పరిగణిస్తారు. ఈ మూలాంకానికి చెందిన భార్యలు వారి భర్తలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఇలాంటి మహిళలు కుటుంబంలో గౌరవం, ప్రతిష్ట, సామాజిక గుర్తింపు పెరగడానికి సహకరిస్తారని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే వారి అభిప్రాయాలను గౌరవించడం, అహంకారంతో ప్రవర్తించకపోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. భార్యకు తగిన గుర్తింపు ఇస్తే భర్తకు పేరు ప్రతిష్ఠలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
మూలాంకం 2
ఏ నెలలోనైనా 2, 11, 20, 29వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకాన్ని 2గా పరిగణిస్తారు. ఈ మూలాంకానికి చెందిన మహిళలు కుటుంబంలో ప్రశాంతత, మానసిక సౌఖ్యం నెలకొల్పడంలో ముఖ్యపాత్ర పోషిస్తారు. ఇలాంటి భార్యలు ఇంటి సభ్యుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేస్తారని నమ్ముతారు. కుటుంబంలో సఖ్యత, పరస్పర అవగామన పెరగడమే కాకుండా, ఆర్థిక స్థిరత్వానికి కూడా వీరి సహకారం ఉంటుందని సంఖ్యాశాస్త్రతం పేర్కొంటోంది. భార్యను సంతోషంగా ఉంచగలిగితే కుటుంబజీవితం మరింత ఆనందంగా సాగుతుంది.
మూలాంకం 3
ఏ నెలలోనైనా 3, 12, 21, 30వ తేదీల్లో జన్మించిన మహిళల మూలాంకాన్ని 3గా పరిగణిస్తారు. ఈ మూలాంకానికి చెందిన భార్యలు భర్తకు మంచి సలహాదారులుగా ఉంటారని న్యూమరాలజీ చెబుతోంది. సుఖదుఃఖాల్లో తోడుగా నిలవడమే కాకుండా కుటుంబాన్ని సమర్థంగా నడిపించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్ఠలు పెరగడంలో వీరి సహకారం ఉంటుంది. ఇలాంటి భార్యల సూచనలను గౌరవించడం వల్ల జీవితంలో మంచి ఫలితాలు సాధించవచ్చని సంఖ్యాశాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మూలాంకం 6
ఏ నెలలోనైనా 6, 15, 24వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకాన్ని 6గా పరిగణిస్తారు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన మహిళలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇలాంటి భార్యలు కుటుంబంలో ఆనందం, ఆర్థికాభివృద్ధి, సౌభాగ్యాన్ని తీసుకొస్తారని నమ్మకం, భార్య పట్ల ప్రేమ, గౌరవం చూపితే ధనలాభంతో పాటు జీవితంలో పురోగతి సాధించే అవకాశాలు పెరుగుతాయని చెబుతారు. మరోవైపు భార్యను నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక నష్టాలు, సమాజంలో గౌరవం తగ్గే అవకాశం అందని హెచ్చరిస్తున్నారు.
మూలాంకం 8
ఏ నెలలోనైనా 8, 17, 26వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 8గా పరిగణిస్తారు. ఈ మూలాంకానికి చెందిన మహిళలు కష్టపడే స్వభావం కలిగి ఉండటంతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలరని చెబుతారు. ఇలాంటి భార్యలు భర్త జీవితంలో స్థిరత్వం తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తారని నమ్ముతారు. కుటుంబసమస్యలను పరిష్కరించడంలో, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడంలో వీరి సహకారం ఎంతో ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. భార్య పట్ల ప్రేమ, గౌరవం చూపితే జీవితంలో అనేక అడ్డంకులు తొలగిపోతాయని చెబుతున్నారు.
అయితే ఇవన్నీ న్యూమరాలజీలో పేర్కొన్న సాధారణ విశ్వాసాలు మాత్రమేనని.. వ్యక్తి జీవితం, విజయాలు, కుటుంబ సంతోషాలు పరస్పర అవగాహన, గౌరవం, ప్రేమ, సహకారం వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయని గుర్తుచుకోవాలి.
Read More:
Numerology | ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారట.. ఎందుకో తెలుసా?
Numerology | ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. భర్తను ఎక్కువగా ప్రేమిస్తారట..!
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

