Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 12 : బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. శ్రీనివాస్ రెడ్డి పార్టీకి చేసిన సేవలను వారు కొనియాడారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తీరును ప్రజల్లోకి వెళ్లి ఎండగడతామని వారన్నారు.
ఈ జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, ఆర్బీఎస్ మండల మాజీ అధ్యక్షుడు పెనుకుల తిరుపతి, మండల నాయకులు కృష్ణమాచారి, జక్కుల రవి, సర్వర్ పాషా, తాటికొండ సందీప్ రెడ్డి, ఒంటెల కిషన్ రెడ్డి, అనుమాండ్ల సత్య నారాయణ, ముక్కెర సదానందం, చెప్యాల నారాయణరెడ్డి, కొమ్మెర మహేందర్ రెడ్డి, మిట్టపల్లి మల్లేశం, బెజ్జంకి లక్ష్మణ్, కూతురు శరభంద రెడ్డి, మెడబోయిన తిరుపతి, కంప అశోక్, కిష్టారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తుల రమేష్, ఎస్కే సిరాజ్, గిట్ల తిరుపతిరెడ్డి, నాగిళ్ల రాజిరెడ్డి, శ్యామకూర సంపత్ రెడ్డి, బుర్ర తిరుపతి, పిల్లి వేణు తదితరులు పాల్గొన్నారు.