SIRICILLA | ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 4: బొప్పాపూర్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు గడ్డి నరసయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకుని బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య శుక్రవారం పరామర్శించారు.
బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి భరోసా అందించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వర్స కృష్ణహరి, ఏఎంసీ మాజీ చైర్మన్ కొండ రమేష్, నాయకులు రామ భీమేష్, ఇల్లేందుల శ్రీనివాస్ రెడ్డి, బొమ్మణవేణి సత్యం తదితరులు ఉన్నారు.