420 హామీలతో కాంగ్రెస్ మోసం
కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు మినహా ఒక్క హామీని అమలు చేయలేదని దుయ్యబట్టారు.
- నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్
సారంగాపూర్, ఏప్రిల్15: కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు మినహా ఒక్క హామీని అమలు చేయలేదని దుయ్యబట్టారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో సోమవారం సా యంత్రం నిర్వహించిన బీఆర్ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌తో కలిసి హాజరయ్యా రు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి చంద్రబాబు అనుచరుడని, ఇప్పడున్నది డూప్లికేట్ కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ అని విమర్శించారు. జీవన్‌రెడ్డికి ఈ ప్రాంత యువత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే, ఆ పదవికి న్యాయం చేయాల్సింది పోయి మొన్న ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయి, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీగా ఉండి నిరుద్యోగుల కోసం ఏం చేశారో.. చెప్పాలని ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ ఏ ఒక్క పనైనా చేశాడా..? అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినా పాపాన పోలేదని, ఆయనకు ఓట్లతో ప్రజలు సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

