వేములవాడ : వేములవాడ ( Vemulawada ) పురపాలక సంఘం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం( Budget Meeting) బుధవారం జరిగింది. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అధ్యక్షతన, కలెక్టర్ గరీమ అగ్రవాల్ ముఖ్యఅతిథిగా సమావేశాన్ని నిర్వహించారు.

కనీసం వారం రోజుల ముందుగా సమాచారం ఇవ్వకుండా సమావేశాన్ని నిర్వహించడంపై బీఆర్ఎస్ ( BRS ) , బీజేపీ కౌన్సిలర్లు ( BJP Councillors ) అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ కాపీలపై అవగాహన పెంచుకోవడానికి సమయం ఇవ్వకుండా సమావేశం నిర్వహించడాన్ని అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ విషయం మినిట్స్‌బుక్‌లో నమోదు చేయాలని కౌన్సిలర్లు పట్టుబట్టారు. సమావేశం అనంతరం నమోదు చేస్తామని మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్ వెల్లడించినా ససేమిరా అంటూ సమావేశాన్ని బైకాట్ చేసి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రామతీర్థపు మాధవి, ఏనుగు జ్యోతి, వెంగళ అనిత, వాసాల లావణ్య, కుమ్మరి శంకర్, వెంగల శ్రీనివాస్, ముత్యం, బోనాల సాగరిక, మామిండ్ల అమర్శ తదితరులు పాల్గొన్నారు.