Brochure launched | కోరుట్ల, సెప్టెంబర్ 8 : కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం సమీపంలో గల శ్రీ దుర్గా దేవాలయంలో నిర్వహించే దేవి శరన్నవరాత్రోత్సవాల కరపత్రాన్ని సోమవారం ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈనెల 22 నుంచి దేవి శరన్నవరోత్రోత్సవాలు ప్రారంభమై అక్టోబర్ రెండు వరకు కొనసాగుతాయన్నారు. అమ్మవారు ఆలయంలో వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు.
వైభవంగా జరిగే అమ్మవారి వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పాలెపు రామకృష్ణ శర్మ, లలిత ఆస్పత్రి వైద్యులు హర్ష, అమర్నాథ్, మాజీ కౌన్సిలర్ పెండ్యం గణేష్, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.